TS News: ఘ‌ట్‌కేస‌ర్‌లో బాలిక‌ అనుమానాస్ప‌ద మృతి
logo
Updated : 19/06/2021 12:22 IST

TS News: ఘ‌ట్‌కేస‌ర్‌లో బాలిక‌ అనుమానాస్ప‌ద మృతి

ఘ‌ట్‌కేస‌ర్‌: మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ వద్ద బాలిక‌(17) అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్కన‌ ప‌డి ఉన్న బాలిక‌ మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దుండ‌గులు హ‌త్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన బాలిక‌ ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన‌ట్లు చెబుతున్నారు. బాలిక‌ను పోచారం రాజీవ్ గృహక‌ల్ప కాల‌నీ వాసిగా గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లిని ఏసీపీ శ్యాంప్ర‌సాద్‌రావు ప‌రిశీలించారు. బాలిక‌ది హ‌త్యా? ఆత్మ‌హ‌త్య? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.

మృత‌దేహాన్ని వాక‌ర్స్ గుర్తించి స‌మాచారం ఇచ్చార‌ని ఘ‌ట్‌కేస‌ర్ సీఐ చంద్ర‌బాబు వివ‌రించారు. ఘ‌ట‌నా స్థ‌లిలో యువ‌తి ఫోన్ ల‌భ్య‌మైన‌ట్లు చెప్పారు. ఆ మొబైల్ ద్వారా బాలిక వివ‌రాలు సేక‌రించిన‌ట్లు తెలిపారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిన‌ట్లు త‌ల్లిదండ్రులు చెప్పార‌న్నారు. బాలిక స్వ‌యంగా ఇంటి నుంచి వెళ్లిందా.? ఎవ‌రైనా తీసుకెళ్లారా.? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. ఆధారాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు సీఐ తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని