Ts News: స్రవంతిది ఆత్మహత్యే!
logo
Updated : 19/06/2021 19:07 IST

Ts News: స్రవంతిది ఆత్మహత్యే!

బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు

ఘ‌ట్‌కేస‌ర్‌: మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ ఔట‌ర్ రింగ్ రోడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక (17) కేసును పోలీసులు ఛేదించారు. స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తరచూ సెల్‌ఫోన్ వినియోగిస్తుందని బాలికను పలుమార్లు తల్లి మందలించింది. నిన్న రాత్రి కూడా ఫోన్‌ విషయంలో స్రవంతిని తల్లి ప్రశ్నించింది. దీంతో మనస్తాపం చెందిన స్రవంతి నిన్న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చుట్టుపక్కల గాలించినా ఆచూకీ తెలియలేదు. ఈఉదయం ఘట్‌కేసర్‌ సమీపంలో బాలిక మృతదేహం గుర్తించిన వాకర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో లభించిన మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా స్రవంతిగా గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని