TS NEWS: సీజేఐను కలిసిన కోదండరామ్‌
logo
Published : 19/06/2021 22:56 IST

TS NEWS: సీజేఐను కలిసిన కోదండరామ్‌

హైదరాబాద్‌: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఆచార్య కోదండరామ్‌ హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో కలిశారు. కోదండరామ్‌తో పాటు తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు సయ్యద్‌ బద్రుద్దీన్‌, శ్రీశైల్‌రెడ్డి.. జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘‘ తెలంగాణం’’ సౌదా రాసిన ‘‘ నల్లగుర్రపు నాడా’’ పుస్తకాలను కోదండరామ్‌, శ్రీశైల్‌రెడ్డిలు సీజేకు బహూకరించారు. న్యాయవ్యవస్థ పరిపుష్టం కావడానికి రమణ వ్యక్తిత్వం, నిబద్దత తోడ్పడగలవని కోదండరామ్‌ ఆకాంక్షించారు. వట్టికోట రచనలు తననెంతో ప్రభావితం చేశాయని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని