TS News: భారీగా హెరాయిన్‌ పట్టివేత
logo
Published : 21/06/2021 10:03 IST

TS News: భారీగా హెరాయిన్‌ పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 15 రోజుల వ్యవధిలోనే డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు రెండోసారి సోమవారం పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు. టాంజానియా దేశానికి చెందిన జాన్‌ విలియమ్స్‌ వద్ద నుంచి 3 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కాసమాచారంతో విమానాశ్రయంలో తెల్లవారుజామున జాన్‌ విలియమ్స్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా అతని వద్ద హెరాయిన్‌ ఉన్నట్లుగా గుర్తించారు.

పట్టుబడిన హెరాయిన్‌ విలువ సుమారు రూ.20కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈనెల 5వ తేదీన జింబాబ్వేకు చెందిన ఇద్దరు మహిళ ప్రయాణికుల నుంచి రూ.78కోట్లు విలువ చేసే 12 కిలోల హెరాయిన్‌ పట్టుకున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని