శామీర్‌పేట చెరువులో రెండు మృతదేహాలు
logo
Published : 21/06/2021 11:26 IST

శామీర్‌పేట చెరువులో రెండు మృతదేహాలు

మేడ్చల్‌ : శామీర్‌పేట చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను అన్నదమ్ములు నందన్‌, గౌతమ్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వీరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్‌లో హోమియో వైద్యులుగా వీరు పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం శామీర్‌పేట చెరువు వద్దకు వెళ్లి వీరు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చెరువులో మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని