Ts News: ఈ ఏడాది ఘనంగా ఆషాఢ మాస బోనాలు
logo
Published : 21/06/2021 17:03 IST

Ts News: ఈ ఏడాది ఘనంగా ఆషాఢ మాస బోనాలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.15కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆషాఢ మాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయామని తలసాని అన్నారు. జులై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్‌ బోనాలు, ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్‌ లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు ఉంటాయని మంత్రి వివరించారు. ఈనెల 25వ తేదీన జరిగే సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌లు అంజనీ కుమార్‌, మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని