గీతం విద్యార్థులకు యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌
logo
Published : 23/06/2021 02:15 IST

గీతం విద్యార్థులకు యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో బీఏ చివరి ఏడాది చదువుతున్న కె.శ్లోకాచంద్ర, సయ్యద్‌ మహ్మమూద్‌ అలీలు అశోకా విశ్వవిద్యాలయం వారి ప్రతిష్టాత్మక యంగ్‌ఇండియా ఫెలోషిప్‌కు ఎంపికయ్యారని డైరెక్టర్‌ వీవీవీ నాగేంద్రరావు చెప్పారు. ఇద్దరు విద్యార్థులు ఏడాది కోర్సు అయిన లిబరల్‌ స్టడీస్‌లో పీజీ డిప్లోమా ఉచితంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తారని తెలిపారు. వాస్తవానికి కోర్సుకు రూ.10లక్షలు ఖర్చు అవుతుందని వివరించారు. అదనపు ఉప కులపతి శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ.. విద్యార్థులను అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని