మద్యం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషణ.. సైబర్‌ మోసం
logo
Published : 23/06/2021 02:15 IST

మద్యం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషణ.. సైబర్‌ మోసం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మద్యం కోసం అంతర్జాలంలో వెతికి ఓ చరవాణి నంబరుకు ఫోన్‌ చేసిన ఓ కన్సల్టింగ్‌ కంపెనీ ప్రతినిధి సైబర్‌ మోసానికి గురైన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన అనురాగ్‌ ప్రశాంత్‌.. రినాయర్‌ కన్సల్టింగ్‌ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌గా కొనసాగుతున్నారు. ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ఈ నెల 14న నగరానికి వచ్చిన ఆయన బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారాలో దిగాడు. ఈనెల 20న మద్యం కోసం ఆన్‌లైన్‌లో పరిశీలించగా ఒక ఫోన్‌ నంబరు కనిపించింది. వెంటనే ఆ నంబరును సంప్రదించాడు. పది నిమిషాల తరువాత అదే నంబరు నుంచి తిరిగి కాల్‌ చేసిన వ్యక్తి క్రెడిట్‌ కార్డు ద్వారా ముందుగా డబ్బు చెల్లిస్తేనే మద్యం సరఫరా చేస్తామని నమ్మించాడు. దీంతో అనురాగ్‌ తన క్రెడిట్‌ కార్డు వివరాలు, వచ్చిన ఓటీపీ చెప్పడంతో వరుసగా రూ.59,900, రూ.10 వేలు తీసుకున్నట్లు సందేశాలు వచ్చాయి. ఫోన్‌ చేసినా సదరు వ్యక్తి స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. బాదితుడు సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని