ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.27 లక్షలు స్వాహా
logo
Published : 23/06/2021 02:15 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.27 లక్షలు స్వాహా

నారాయణగూడ, న్యూస్‌టుడే : ఉద్యోగాలిస్తామంటూ దాదాపు 19 మంది నిరుద్యోగుల నుంచి రూ.27 లక్షలు దోచేశారు. ఈమేరకు బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. లోతుకుంటకు చెందిన బుచ్చిరాములు, మరో 18 మంది ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని, తాను ఆ కంపెనీ మేనేజర్‌నని చెప్పాడు. బాధితుల నుంచి ఇంటర్య్వూ, ప్రాసెసింగ్‌, ల్యాప్‌టాప్‌ వంటి సాకులు చెప్పి రూ.27 లక్షలు కట్టించుకున్నాడు. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేశాడు. బాధితులంతా హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని