టీకా పేరుతో నిర్మాత సురేష్‌బాబుకు బురిడీ
logo
Updated : 23/06/2021 14:07 IST

టీకా పేరుతో నిర్మాత సురేష్‌బాబుకు బురిడీ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వాక్సిన్‌ పేరుతో సినీ నిర్మాత సురేష్‌ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మే 25న నిర్మాత సురేష్‌బాబుకు నాగార్జునరెడ్డి పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. తన వద్ద కొవిడ్‌ వాక్సినేషన్‌ ఉందని, రూ.లక్ష పంపిస్తే 500 డోసులు పంపిస్తానని నమ్మించాడు. ఇందుకు తన భార్య పేరుతో ఉన్న ఖాతాలో డబ్బులు వేయాలన్నాడు. ఆ మేరకు సురేష్‌బాబు ఆ మొత్తాన్ని సదరు ఖాతాకు పంపారు. నిందితుడు వెంటనే ఆ డబ్బు తీసుకుని తన చరవాణిని ఆపేశాడు. సురేష్‌బాబు, ఆయన సహాయకులు పలుమార్లు ఆ చరవాణికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ నెల 21న సురేష్‌బాబు సహాయకుడు రాజేంద్రప్రసాద్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు నాగార్జునరెడ్డిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే నిందితుడు గతంలో ఓ మీడియా కార్యాలయంలో ఉద్యోగులను సైతం వాక్సిన్‌ పేరుతో నమ్మించి దాదాపు రూ. లక్షన్నర దండుకున్నాడు. ఓ వస్త్ర దుకాణ వ్యాపారిని ఇదే రీతిలో మోసం చేయడానికి ప్రయత్నించాడు. సదరు నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి వారం కిందటే జైలుకు పంపారు. ప్రస్తుతం అతడు సంగారెడ్డి జైలులో ఉన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని