జానపద కళాకారులకు చేయూత
logo
Published : 23/06/2021 02:15 IST

జానపద కళాకారులకు చేయూత

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌, యువకళావాహినిల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి చేతుల మీదుగా కొవిడ్‌ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వంద మంది పేద జానపద కళాకారులకు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున అందజేశారు. మంగళవారం రెడ్‌హిల్స్‌లో యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో డా.కె.వి.రమణాచారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ‘జబర్దస్త్‌’ జీవన్‌కు సారిపల్లి కొండలరావు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆన్‌లైన్‌ ఆయన ఖాతాకు బదిలీ చేశారు. కార్యక్రమంలో యువ కళావాహిని ప్రతినిధులు బొప్పన నరసింహారావు, జి.మల్లికార్జునరావు, జీవీఆర్‌ ఆరాధన ఫౌండేషన్‌ అధ్యక్షులు గుదిబండి వెంకట్‌రెడ్డి, తెలంగాణ జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వంగ శ్రీనివాస్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని