సీఎంఆర్‌లో టాయ్‌కథాన్‌ సదస్సు ప్రారంభం
logo
Published : 23/06/2021 02:15 IST

సీఎంఆర్‌లో టాయ్‌కథాన్‌ సదస్సు ప్రారంభం

మేడ్చల్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వేదికను ఏర్పాటు చేస్తోందని సీఎంఆర్‌ కళాశాలల కార్యదర్శి గోపాల్‌రెడ్డి సూచించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ సీఎంఆర్‌ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘టాయ్‌కథాన్‌-2021’ వర్చువల్‌ సదస్సును ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులందరికీ ప్రధాని మోదీ పరస్పర చర్చ, పరిచయ ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మేజర్‌ వీఏ.నారాయణ, ముత్తంగి కాంతారెడ్డి, అభినవ్‌, విజయ్‌కుమార్‌, సురేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని