అనుమతి లేదా.. ఆందోళన కుదరదు
logo
Published : 23/06/2021 02:15 IST

అనుమతి లేదా.. ఆందోళన కుదరదు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు, ధర్నాలు చేయాలంటే ఇకనుంచి ముందుగా అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు వర్సిటీ పాలకమండలి(ఈసీ) సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ అధ్యక్షతన మంగళవారం ఓయూలో తొలి ఈసీ సమావేశం నిర్వహించారు. వర్సిటీలో భద్రత, విద్యార్థుల ఆందోళనలపై విశ్వవిద్యాలయం నియమించిన కమిటీ చేసిన సూచనలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇక్కడి ఆర్ట్స్‌ కళాశాల ముందు నిత్యం ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, వివిధ సందర్భాల్లో సంబరాలు చేస్తుంటారు. దీంతో అకడమిక్‌ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందని ఈసీ భావిస్తోంది. అలాగే వర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. భూములను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చర్చించారు. బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రార్‌, డీన్ల నియామకాలకు ఆమోదం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని