ఆశ్రమానికి చేరిన సుశీలమ్మ
logo
Published : 23/06/2021 02:29 IST

ఆశ్రమానికి చేరిన సుశీలమ్మ

వృద్ధురాలిని ఆశ్రమ నిర్వాహకులకు అప్పగిస్తున్న ప్రతినిధులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: కనిపెంచిన పిల్లలు వదిలేయడం, భర్తను కోల్పోయి దయనీయ స్థితిలో గాంధీ ఆసుపత్రి వద్ద మెట్రో విభాగినిపైకి చేరుకున్న సుశీలమ్మకు ఆశ్రయం లభించింది. ఆమె దీనావస్థపై ఈనెల 21న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘దూరమైన తోడూనీడ.. గోడపైనే జ్ఞాపకాల జాడ!’ శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి.. సిటీ సివిల్‌కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జీ కె.మురళీమోహన్‌, మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి రాధాకృష్ణ చౌహాన్‌ స్పందించారు. వారి ఆదేశాల మేరకు మంగళవారం అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఆమెకు ఆహారం అందించారు. ‘గాంధీ’లో కొవిడ్‌ పరీక్ష చేయించారు. అనంతరం బోయిగూడలోని నిర్మల్‌ హృదయ్‌ మదర్‌థెరెసా హోంలో చేర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలూ ఆమెను ఆదుకునేందుకు ముందుకొచ్చాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని