హెచ్చరించినా సీఎం పట్టించుకోలేదు: భట్టి
logo
Published : 23/06/2021 16:31 IST

హెచ్చరించినా సీఎం పట్టించుకోలేదు: భట్టి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు నీటి యుద్ధం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో తెరాస ప్రభుత్వం, మంత్రులు ఏడాది తర్వాత మేల్కొన్నారని భట్టి ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది కిందటే జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తూ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని తాము చెప్పినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకముందే హెచ్చరించినప్పటికీ సీఎం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి ఒక్క ఏకరానికి కూడా నీరు అందలేదని భట్టి విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని