Ts News: 97 లక్షల మందికి టీకా
logo
Updated : 24/06/2021 15:16 IST

Ts News: 97 లక్షల మందికి టీకా

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు 97 లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకున్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ వెల్లడించారు. వారిలో 83 లక్షల మంది మొదటి డోసు వేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 100 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీనితోపాటుగా 24 మొబైల్‌ వ్యాన్ల ద్వారా కూడా టీకాలు అందిస్తున్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి 30 ఏళ్లు పైబడిన వారికీ టీకాలు వేస్తున్నామన్నారు. ఒకట్రెండు రోజుల్లో కోటి మార్క్‌కి వ్యాక్సినేషన్‌ చేరుకుంటుందన్నారు. జులైలో 21 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టీచర్లు ఐడీ కార్డులు చూపించి వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వెలుగు చూడలేదని.. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహెచ్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని