శాస్త్రీయంగా వాయు కాలుష్యం లెక్కలు
eenadu telugu news
Published : 24/07/2021 02:22 IST

శాస్త్రీయంగా వాయు కాలుష్యం లెక్కలు

హైదరాబాద్‌లో 8 కేంద్రాల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో వాయు నాణ్యత, కాలుష్య స్థాయిని నిరంతరం, శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కొత్తగా 8 చోట్ల ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్ణయించింది. ఒకటి రెండు నెలల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సహా జిల్లాల్లోనూ వాయు కాలుష్యాన్ని లెక్కిస్తున్నా ఆరుచోట్ల మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసే స్టేషన్లున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం 50 లక్షల పైచిలుకు జనాభా ఉన్న నగరాల్లో కనీసం ఆరుకు పైగా నమోదు కేంద్రాలు ఉండాలి. కేంద్రం నుంచి రూ.8 కోట్ల నిధులు రావడంతో కొత్త కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పరికరాల్ని పీసీబీ కొనుగోలుచేసింది. కొత్త స్టేషన్ల ఏర్పాటుపై ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ కాన్పూర్‌తో అధ్యయనం చేయిస్తోంది. ఐఎండీ నుంచి 20 ఏళ్ల డేటా సేకరిస్తోంది.

ప్రస్తుతం ఉన్న కేంద్రాలు: బొల్లారం, ఇక్రిశాట్‌, సనత్‌నగర్‌, జూపార్క్‌, ఐడీఏ పాశమైలారం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ.

కొత్తగా రానున్నవి: బోయిన్‌పల్లి, ఎల్‌బీనగర్‌, హైటెక్‌సిటీ, ఖైరతాబాద్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌, బడంగ్‌పేట, పాత ఎయిర్‌పోర్టు. మరో రెండుచోట్ల.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని