ఆర్టీసీ బస్సు డ్రైవరుకు మూర్ఛ
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

ఆర్టీసీ బస్సు డ్రైవరుకు మూర్ఛ

ప్రయాణికులు, వాహనదారులకు తప్పిన పెను ప్రమాదం

 

తూప్రాన్‌, న్యూస్‌టుడే: బస్సు నడిపిస్తున్న తరుణంలో డ్రైవరుకు మూర్ఛ రాగా వెంటనే ఒక్కసారిగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన సోమవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు 60 మంది ప్రయాణికులతో కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో తూప్రాన్‌ బస్టాండ్‌ దాటి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో బస్సు డ్రైవరు ఎం.డి.మహబూబ్‌కు మూర్ఛ రాగా, వెంటనే రోడ్డుపైనే ఆపేసి స్పృహ కోల్పోయాడు. దీన్ని గమనించిన కండక్టర్‌ కృష్ణమోహన్‌, స్థానికుల సాయంతో అతడికి సపర్యలు చేశారు. తేరుకున్న తర్వాత మహబూబ్‌ను తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సును చాకచక్యంగా నిలిపివేయడంతో అందులో ఉన్న 60 మంది ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పినట్లయింది. అనంతరం ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని