అప్పులు తీర్చలేక మనస్తాపం.. యువకుడి బలవన్మరణం
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

అప్పులు తీర్చలేక మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

 

దుబ్బాక, న్యూస్‌టుడే: చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన గూడూరు దేవేందర్‌ (27) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలంగా సరైన పనులు దొరక్క ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పోషణకు పలువురి దగ్గర అప్పులు చేశాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం లేక మనోవేదన చెందాడు. సోమవారం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి భార్య అనిత, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని