ఇంటి నుంచి వెళ్లి.. హత్యకు గురై..
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

ఇంటి నుంచి వెళ్లి.. హత్యకు గురై..

కొండాపూర్‌, న్యూస్‌టుడే: మండల పరిధి మల్కాపూర్‌ శివారులో వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మల్కాపూర్‌కు చెందిన నాటుకారి రామలింగం(34) 14 ఏళ్ల క్రితం సంగారెడ్డి మండలం కల్పగూర్‌కు చెందిన అనితను ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో గొడవపడి కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో కలసి సంగారెడ్డి శివారులోని లక్ష్మీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వారం రోజుల క్రితం డ్రైవరుగా పనిచేస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం మల్కాపూర్‌ శివారులో అతడు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారు. రామలింగంను తలపై గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణలపై విచారిస్తున్నామన్నారు. త్వరలో నిందితులను గుర్తించి వివరాలను వెల్లడిస్తామన్నారు. రామలింగం తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పరిశీలించి వివరాలు సేకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని