విత్తులోనే మహత్తు
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

విత్తులోనే మహత్తు

 

పంటల సాగులో అన్నింటికన్నా కీలకం విత్తనం. అందుకే పెద్దలు ‘విత్తు కొద్దీ పంట’ అన్నారు. నాణ్యమైన పంట రావాలంటే నమ్మకమైన విత్తనం వాడాలి. నాసిరకం విత్తనాలతో పంట సరిగ్గా రాకపోవడమే కాకుండా విలువైన కాలం, పడిన శ్రమ వృథా అవుతాయి. అందువల్ల విత్తన ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా విత్తనాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి దేశవాళీ, సంకర (హైబ్రిడ్‌) విత్తనాలు. దేశవాళీ విత్తనాలనే సంప్రదాయ విత్తనాలు అంటారు. అనాదిగా రైతులు వీటినే వాడుతున్నారు. తాము పండించిన పంట నుంచే వీటిని సేకరించుకోవచ్ఛు సంకర విత్తనాలు అలా కాదు. వాటిని ప్రత్యేక పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. గత పంట నుంచి సేకరించిన విత్తనాన్ని వాడితే పంట సరిగ్గా రాదు. అందువల్ల ఈ విత్తనాలను వాడాల్సిన ప్రతిసారీ కొనుగోలు చేయాల్సిందే. దేశీ విత్తనాలు స్థానిక వాతావరణానికి అనువైనవి. ఈ విత్తనాల కొనుగోలు ఖర్చు తక్కువ. ఇవి చీడపీడలను, నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటాయి. మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడులను అందిస్తాయి. అయితే నర్సరీల్లో, దుకాణాల్లో వీటి అందుబాటు తక్కువే. ఇప్పుడు మార్కెట్లో రైతులు వాడుతున్న విత్తనాల్లో సింహభాగం సంకర విత్తనాలే. దేశీ రకాలనే సూటి రకాలు అని కూడా పిలుస్తారు. వ్యవసాయశాఖ వారి వద్ద ఈ రకం విత్తనాలు లభిస్తాయి. అప్పటికే ఇంటి పంటలను సాగు చేస్తున్న వారి వద్ద గానీ, తెలిసిన రైతుల నుంచి గానీ దేశీ రకాల విత్తనాన్ని సేకరించుకోవచ్ఛు ఇటీవల సామాజిక మాధ్యమాల్లోనూ ఈ విత్తనాల లభ్యతపై సమాచారం దొరుకుతోంది. ఇలా ఒకసారి సేకరించిన విత్తనాన్ని నాటి జాగ్రత్తగా పెంచి, మొదటి కాపులోనే ఒకటి, రెండు కాయలను విత్తనం కట్టి తదుపరి పంటకు వాడుకోవచ్ఛు ఇలా ప్రతి ఏడాది చేస్తూ.. ఏళ్లపాటు కొనసాగించవచ్ఛు ఈ విత్తనాలు దొరకనప్పుడు సంకర విత్తనాలనైనా నాటండి. సేంద్రియ పద్ధతిలో ఇవి కూడా రుచిగానే ఉంటాయి.

నాణ్యమైన విత్తనాలు, ఇంటిపంటల సాగులో సలహాలకు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లిలోని అర్బన్‌ ఫార్మింగ్‌ విభాగం, గవర్నమెంట్‌ గార్డెన్స్‌ ఉద్యానశాఖ అధికారి(ఫోన్‌: 7997724934/ 9014649164)ని సంప్రదించవచ్ఛు horticulture.tg.nic.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు చూడవచ్ఛు నారుమొక్కల కోసం.. ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ జీడిమెట్ల (ఫోన్‌: 7997724956) వారిని, పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం (ఫోన్‌: 9849733741/ 9494963291) వారిని సంప్రదించండి. కిచెన్‌ గార్డెన్‌ విత్తనాల కోసం.. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ, లాలాగూడ (ఫోన్‌: 040-27721152) లేదా నమ్మకమైన ప్రయివేట్‌ విత్తన కంపెనీల వారిని, దేశవాళీ విత్తనాల కోసం వెలది పురుషోత్తమరావు (ఫోన్‌: 7207501515), రైతుమిత్ర సంస్థ (ఫోన్‌: 9381172615), రైతురాజ్యం నేచురల్‌ ప్రొడక్ట్స్‌ (ఫోన్‌: 9030595899)ను సంప్రదించవచ్చు.

- అన్నదాత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని