హిమాయత్‌సాగర్‌లో మరో 4 గేట్లు మూసివేత
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

హిమాయత్‌సాగర్‌లో మరో 4 గేట్లు మూసివేత

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు నిలిచిపోవడంతో జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టింది. ఉస్మాన్‌సాగర్‌ గేట్లను మూసివేయగా, హిమాయత్‌సాగర్‌లో సోమవారం నాలుగు గేట్లు మూసి, ఒక్కటే తెరిచారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు ప్రస్తుతం 1761.75 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 343 క్యూసెక్కులు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తి నీటి మట్టం 1790 అడుగులకు 1786 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 150 క్యూసెక్కులు ఉందని, అవుట్‌ఫ్లో లేదని జలమండలి తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని