యువతికి పునర్జన్మ
eenadu telugu news
Updated : 27/07/2021 11:21 IST

యువతికి పునర్జన్మ

విజయవంతంగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి

ఈనాడు, హైదరాబాద్‌: రెండున్నరేళ్లు ఆక్సిజన్‌తో మంచానికే పరిమితమై మృత్యుముఖం వరకు వెళ్లిన యువతికి అపోలో వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి ప్రాణం పోశారు. సోమవారం ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డా.గోపాలకృష్ణ గోఖలే మీడియాకు వెల్లడించారు. పుట్టుకతోనే గుండెలో రంధ్రం(వెంట్రిక్యులర్‌ సెప్టల్‌)తో బాధపడుతున్న యువతి(25)కి, శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల మధ్య ఇబ్బంది తలెత్తింది. ఊపిరితిత్తులపైనా అధిక భారం పడి ఆరోగ్యం క్షీణించింది. చివరి ప్రయత్నంగా ఆమె తల్లిదండ్రులు అపోలో వైద్యులను సంప్రదించారు. పరిశీలించిన వైద్యులు..గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఒకేసారి రెండు అవయవాలను మార్చాలని స్పష్టం చేశారు. ఆమెకంటే తక్కువ వయసున్న దాత అవయవాలు లభించడం కష్టసాధ్యమైంది. 18 ఏళ్ల యువతి జీవన్మృతురాలిగా మారినట్లు తెలియడంతో జీవన్‌దాన్‌ ప్రతినిధులు కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారు పెద్దమనసుతో తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. ఆ యువతి గుండె, ఊపిరితిత్తులు సేకరించి దాదాపు 10-14 గంటలు శ్రమించి, జులై 20న విజయవంతంగా 25 ఏళ్ల యువతికి అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని