కమఠోపసర్గ పార్శ్వనాథుడి విగ్రహం పోచారంలో గుర్తింపు
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

కమఠోపసర్గ పార్శ్వనాథుడి విగ్రహం పోచారంలో గుర్తింపు


లభ్యమైన శిలా విగ్రహాలివే

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: జైనశిల్పాలలో అరుదైన కమఠోపసర్గ పార్శ్వనాథుని విగ్రహాన్ని పటాన్‌చెరు మండలం పోచారంలో కనుగొన్నామని చరిత్రకారుడు, రచయిత భద్రగిరీశ పేర్కొన్నారు. కల్యాణిచాణుక్యుల కాలంలో పటాన్‌చెరు జైనులకు కేంద్రంగా ఉండేదని, వేలాది మంది జైనమునులు నివాసం ఉన్నారని తెలిపారు. స్థానికంగా జైనశిల్పాలు చెక్కి జైనులు నివసించే ప్రాంతానికి తరలించే వారని వివరించారు. కొల్చారం, కొలనుపాక ప్రాంతాల్లో జైనక్షేత్రాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించారని తెలిపారు. వాటిల్లో కమఠోపసర్గ పార్శ్వనాథ తీర్థంకరుడి విగ్రహం ప్రపంచంలో అరుదైనదని అన్నారు. పోచారంలో చెట్టు కింద పెట్టి దేవరగా గ్రామస్థులు పూజలు చేస్తున్నారని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని