మెగా రక్తదాన శిబిరానికి ఉప రాష్ట్రపతి అభినందన
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

మెగా రక్తదాన శిబిరానికి ఉప రాష్ట్రపతి అభినందన

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తలసీమియాతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోపీనాథ్‌కు ఆయన ఈ నెల 16న పంపిన లేఖ సోమవారం అందిందని, దీంతో 2425 మందితో చేసిన రక్తదాన శిబిరం విశేషాలు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో సాధించిన ఘనత వివరాలను జతపరుస్తూ ఉప రాష్ట్రపతికి తిరిగి లేఖ పంపినట్లు ఎమ్మెల్యే వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని