అవినీతిని ప్రశ్నించిన పాలకులపై అక్రమ కేసులా?
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

అవినీతిని ప్రశ్నించిన పాలకులపై అక్రమ కేసులా?

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో అధికారుల అవినీతిని ప్రశ్నించిన మహిళా కౌన్సిలర్ల భర్తలతోపాటు ఇద్దరు కౌన్సిలర్లపై కమిషనర్‌ అహ్మద్‌ సఫీ ఉల్లా అక్రమ కేసులు నమోదు చేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిమండిపడ్డారు. సోమవారం తుర్కయాంజాల్‌ కూడలిలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఛైర్‌పర్సన్‌ అనురాధరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.ఓ పక్క దళిత బంధు అంటూనే మరోపక్క క్షేత్రస్థాయిలో దళితులపై వివక్ష చూపుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ అక్రమార్జనపై కలెక్టర్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మల్‌రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. ధర్నాలో హరితగౌడ్‌, మల్‌రెడ్డి రాంరెడ్డి, ఐలయ్య, మంగమ్మ, రవీందర్‌రెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని