విందుకు వెళ్లొస్తూ విగతజీవులయ్యారు!
eenadu telugu news
Updated : 27/07/2021 05:48 IST

విందుకు వెళ్లొస్తూ విగతజీవులయ్యారు!

కండ్లపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

మల్లికార్జున్‌డ్డి                          రాజ్యలక్ష్మి                        దేవాన్ష్‌రెడ్డి

పూడూరు, న్యూస్‌టుడే: విందు కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళుతుండగా.. ఆ కుటుంబంలోని ముగ్గురిని రోడ్డు ప్రమాదం కబళించింది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో జరిగిన సంఘటన వివరాలు ఎస్సై శ్రీశైలం తెలిపిన ప్రకారం... వికారాబాద్‌ పట్టణం బీటీఎస్‌కు చెందిన ఎర్రవల్లి సంతోష్‌రెడ్డి, భార్య స్వాతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. భర్త హైదరాబాద్‌లో పని చేస్తుండగా, స్వాతి అమెరికాలో ఉన్నారు. నార్సింగిలో వీరి కుటుంబం ఉంటోంది. వికారాబాద్‌లో బంధువుల ఇంట్లో ఓ విందుకు హాజరయ్యేందుకు తండ్రి మల్లికార్జున్‌రెడ్డి(61), తల్లి రాజ్యలక్ష్మి(56), కుమారుడు దేవాన్ష్‌రెడ్డి(06)తో కలిసి సంతోష్‌రెడ్డి ఆదివారం కారులో వచ్చారు. రాత్రి ఇక్కడే ఉన్న వారు సోమవారం ఉదయం 7 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. కండ్లపల్లి గేటుదాటిన కొద్ది క్షణాల్లోనే ఎదురుగా వచ్చిన క్వాలిస్‌ వాహనం అదుపుతప్పి వీరి కారును ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సంతోష్‌రెడ్డి కుమారుడు, తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సంతోష్‌రెడ్డికి తీవ్రగాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. సంతోష్‌రెడ్డికి దేవాన్ష్‌రెడ్డి ఒక్కడే కుమారుడు. ప్రమాదంపై అమెరికాలోని స్వాతికి సమాచారం అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని