ఏక స్వరమై.. అమ్మ స్మరణ
eenadu telugu news
Updated : 27/07/2021 02:55 IST

ఏక స్వరమై.. అమ్మ స్మరణ

అంబారిపై వైభవంగా మహాకాళి ఊరేగింపు

ప్రత్యేక అలంకరణలో ఉజ్జయిని

వర్షాలతో ప్రజలు కొంత ఇబ్బందికి గురైనా.. నేను వెంట ఉండి నడిపిస్తా. కరోనా మహమ్మారితో ఎన్ని కష్టాలు ఎదురైనా మహోత్సవాలు జరిపినందుకు సంతోషంగా ఉన్నా. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను.

- రంగంలో అమ్మవారి భవిష్యవాణి

బన్సీలాల్‌పేట, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో బోనాల వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. అమ్మవారి ముఖమండపంలోని మాతాంగేశ్వరి ఆలయం వద్ద భక్తురాలు స్వర్ణలత పచ్చికుండపై కాలుమోపి భవిష్యవాణి వినిపించారు. రెండో రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారి చిత్రపటాన్ని ఆశీనులు చేసి నిర్వహించిన ఏనుగు అంబారి ఊరేగింపు అట్టహాసరగా సాగింది. అంతకుముందు మంత్రి తలసాని, నిర్వాహకులు నరేశ్‌.. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతినిచ్చారు. భారీ పోలీసు భద్రత మధ్య ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అంబారి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉజ్జయిని మహాకాళి మాతాకీ జై.. మాణిక్యాలమ్మ తల్లీకి జై అంటూ భక్తుల నినాదాలు మిన్నంటాయి. రంగం అనంతరం పోతరాజుల గావు కార్యక్రమం సందడిగా సాగింది.

ఆలయం వద్ద ప్రత్యేకంగా రూపొందించిన ఘటం ఊరేగింపు

 

రంగం చెప్పేందుకు వస్తున్న స్వర్ణలత

పటిష్ఠ బందోబస్తు నడుమ గజాధిరోహణం చేసి భక్తులకు దర్శనమిస్తున్న మహాకాళి


పోతరాజులతో కలిసి నృత్యం చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసు


క్యూ లైన్లలో దర్శనానికి బారులు తీరిన భక్తులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని