సమన్వయంతో సాగితేనే పురోగతి
eenadu telugu news
Published : 29/07/2021 00:57 IST

సమన్వయంతో సాగితేనే పురోగతి

పనులు పరిశీలిస్తున్న అధికారి కృష్ణన్‌

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణన్‌ అన్నారు. బుధవారం మోమిన్‌పేట అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీసీ డైరక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు అద్దె నిర్వహణ అంతంత మాత్రమే సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. విపణిలో లభించే ధర కంటే అతి తక్కువకే పరికరాలు అందుబాటులో ఉన్నా లక్ష్యం నెరవేరడంలేదన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు, సెర్ప్‌ సిబ్బంది సమష్టిగా ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. అనంతరం మోరంగపల్లిలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు పరిశీలించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీఓ శంకర్‌కు సూచించారు. చిట్టడవులను పెంచేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజారెడ్డి, ఏపీడీ నర్సింహులు, డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎంలు రాజు, నర్సింహులు, ఈసీ వికాష్‌, ఎఫ్‌ఫీసీ అధ్యక్ష ఉపాధ్యక్షురాలు లక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని