పల్లె ప్రకృతి వనాల లక్ష్యం పూర్తి: అదనపు కల్టెర్‌
eenadu telugu news
Published : 29/07/2021 00:57 IST

పల్లె ప్రకృతి వనాల లక్ష్యం పూర్తి: అదనపు కల్టెర్‌

కేటాయించిన స్థలం వద్ద అధికారి చంద్రయ్య

పూడూరు, న్యూస్‌టుడే: పూడూరు మండలం కండ్లపల్లిలో ఏర్పాటు చేయనున్న బృహత్‌ ప్రకృతి వనం పనులను త్వరితగతిన ప్రారంభించాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పిలుపునిచ్చారు. ఎంపీడీఓ ఉష, సర్పంచి యాదమ్మ, ఉప సర్పంచి మహబూబ్‌అలీతో కలిసి పార్కుకు కేటాయించిన పదెకరాల స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పల్లె ప్రకృతి వనాల లక్ష్యం దాదాపు పూర్తయిందని చెప్పారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. డంపింగ్‌ యార్డును పరిశీలించి పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ శ్రీశైలంగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌గౌడ్‌, ఏపీఓ రాములు నాయకులు శ్రీనివాస్‌, సదానందంగౌడ్‌, రవి, వెంకటేశ్‌లు ఉన్నారు.

పనులు పూర్తిచేయకుంటే వేటు తప్పదు

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: ‘పది రోజుల్లో వైకుంఠ ధామం నిర్మాణాన్ని పూర్తిచేయాలి. లేకుంటే సస్పెన్షన్‌కు గరవుతార’ని అదనపు పాలనాధికారి చంద్రయ్య హెచ్చరించారు. ఆయన బుధవారం పరిగి మండల పరిధిలోని పేటమాదారం, పోల్కంపల్లి గ్రామాలను సందర్శించారు. వైకుంఠ ధామం పనులు పూర్తికాక పోవడాన్ని గమనించి రెండు గ్రామాల సర్పంచులతో పాటు అధికారులను హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని