నేటి నుంచి ‘టీసీటీ ఇండియా సౌత్‌ ఆసియా-2021’ సదస్సు
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

నేటి నుంచి ‘టీసీటీ ఇండియా సౌత్‌ ఆసియా-2021’ సదస్సు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: గుండె సంబంధిత వైద్య చికిత్సను మరింత అత్యాధునిక మార్గంలో ఎలా నిర్వహించవచ్చనే అంశంపై మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్‌ కార్డియాలజీ(టీసీటీ ఇండియా సౌత్‌ ఆసియా-2021) సదస్సు గురువారం నుంచి జరగనుంది. ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించే ఈ సదస్సుకు అపోలో హాస్పిటల్స్‌ సహకారం అందిస్తుంది. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్స్‌ రీజినల్‌ సీఈవో వై.సుబ్రహ్మణ్యం వివరాలను వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదు వేల మంది కార్డియాలజీ వైద్య నిపుణులు పాల్గొంటున్నట్లు తెలిపారు. దీంతో మరింత అత్యాధునిక వైద్య విధానం అందుబాటులోకి వచ్చి రోగులకు త్వరిత గతిన స్వస్థత చేకూరడం సాధ్యపడుతుందన్నారు. ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌, అపోలో హాస్పిటల్‌ కార్డియాలజీ అండ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డా||ఎ.శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ ఇలాంటి సదస్సు తొలిసారిగా 2010లో జరగగా మళ్లీ ఇప్పుడు వర్చువల్‌గా నిర్వహిస్తున్నామన్నారు. 29, 30, 31 తేదీల్లో రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందని వివరించారు. డా.ఎం.గోకుల్‌రెడ్డి, డా.కె.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని