హస్తకళ.. చేనేత వస్త్రం భళా!
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

హస్తకళ.. చేనేత వస్త్రం భళా!

ప్రదర్శనకు ఉంచిన దుస్తులు తిలకిస్తున్న మహిళలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అందం.. హుందాతనం.. కలగలిపిన చేనేత వస్త్రంపై మనసు పడని మగువలెవరు..? ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ కళను నగరవాసులకు చేరువ చేసేందుకు క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ తెలంగాణ నడుం బిగించింది. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడంతోపాటు ఈ గొప్ప కళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు ‘ఆకృతి వస్త్ర మేళా-2021’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. దేశంలో పేరెన్నిక గల డిజైనర్లు, హస్తకళలు, అజ్రక్‌, కోటా, గుజరాతీ, రాజస్థానీ ప్రాంత వస్త్రాలు, గృహోపకరణ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీసీటీ సభ్యురాలు సీతా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ నగర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేనేతకు చేయూతనివ్వాలని కోరారు. సీసీటీ ఛైర్మన్‌ ఉషా సర్వారాయులు మాట్లాడుతూ హస్తకళలకు గుర్తింపు తేవడమే లక్ష్యమన్నారు. సీసీటీ సభ్యులు రుద్రమ, నిర్మల, నందిని, శారద, భువన తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడ : సీసీటీ భవనం, బంజారాహిల్స్‌

ఏమేమున్నాయి: నిజాం నవాబుల కాలంలో ఉపయోగించిన బిద్రీ గృహోపకరణ బొమ్మలు, పోచంపల్లి, గద్వాల, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్‌ దరీలతోపాటు దేశంలో చేనేతకు ప్రసిద్ధి పొందిన 21 ప్రాంతాల చీరలు. ప్రవేశం: ఉచితం

సమయం : ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని