మంత్రిపై హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

మంత్రిపై హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దంపతులు విశ్వనాథరావు, పుష్పలత బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. 2018 ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధించిన ఓ కేసులో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక రూరల్‌ సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న తమ ఇద్దరినీ ఉద్యోగాల్లోంచి తీయించేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు కమిషన్‌ పరిశీలనలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని