కుమార్తెల ఫీజు కట్టలేక మనస్తాపం
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

కుమార్తెల ఫీజు కట్టలేక మనస్తాపం

గూడ్స్‌ రైలుకిందపడి వ్యక్తి ఆత్మహత్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: తాను పనిచేస్తున్న బార్‌ షాపు కరోనా నేపథ్యంలో ఏడాదిగా మూతపడటంతో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులకు తోడు కుమార్తెల ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి వెంకటపురం ప్రాంతానికి చెందిన పూడరి మహేష్‌గౌడ్‌(45) నగరంలోని ఓ బార్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సునీత, బీఫార్మసీ, బీటెక్‌ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యం దుకాణం మూతపడడంతో ఆదాయం లేక కుమార్తెల కళాశాల ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బుధవారం స్థానిక రైల్వేగేట్‌ చెంత బైక్‌ను నిలిపి అమ్ముగూడ- అల్వాల్‌ వెంకటపురం స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది అధికారుల ద్వారా సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌ గుర్తింపుకార్డు సాయంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని