మహిళల భద్రతకు ‘భరోసా కేంద్రం’
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

మహిళల భద్రతకు ‘భరోసా కేంద్రం’

శంకుస్థాపన చేస్తున్న మంత్రి మహమూద్‌ అలీ, చిత్రంలో మహేందర్‌రెడ్డి, మహేష్‌ భగవత్‌

సరూర్‌నగర్‌, నాగోలు, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం సరూర్‌నగర్‌ మహిళా ఠాణా ఆవరణలో ‘భరోసా కేంద్రం’ భవన నిర్మాణానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభీవాణిదేవి, బుగ్గారపు దయానంద్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన షీ టీమ్‌ భవనం, ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌, ఈ చాలన్‌ కార్యాలయాలను ప్రారంభించారు. అక్కడే నిర్మించతలపెట్టిన సీడీఈడబ్ల్యూ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌) కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దామోదర్‌, అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్‌, రక్షితమూర్తి, నారాయణరెడ్డి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ శ్రీవాణిఅంజన్‌, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని