ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు చేసినా చాలు!
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు చేసినా చాలు!

ఈనాడు, హైదరాబాద్‌: వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అధ్యాపకుల నియామకంలో నిబంధనలు సడలిస్తూ జేఎన్‌టీయూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు చదివిన వారిని పదిశాతానికి మించకుండా అధ్యాపకులుగా నియమించుకోవచ్చని సూచించింది. మెకానికల్‌, సివిల్‌, సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాలలో ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సుల వారికి అవకాశం కల్పించింది. ఈ కోర్సులతోపాటు ఎంటెక్‌ లేదా ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ లేదా రెండు ఎన్‌పీటీఈఎల్‌ కోర్సులు చేసినవారు అర్హులవుతారు. ఈ కోర్సులు చేసిన అధ్యాపకులకు ఫ్యాకల్టీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఎంతోమంది ఉద్యోగాలు లభించక ఇబ్బందులు పడ్డారు. అనుబంధ, అటానమస్‌ కళాశాలల నుంచి వర్సిటీకి విజ్ఞప్తులు రావడంతో నియామకానికి ఆమోదం తెలిపింది. వర్సిటీ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి అనుమతితో రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని