టాప్‌-10లో నలుగురు మనవాళ్లే
eenadu telugu news
Published : 29/07/2021 02:16 IST

టాప్‌-10లో నలుగురు మనవాళ్లే

పాలిసెట్‌ ఫలితాల్లో నగర విద్యార్థుల సత్తా

ఈనాడు, హైదరాబాద్‌: పాలిసెట్‌-2021 ఫలితాల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 14,856 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 12,187 మంది ఎంపీసీ విభాగంలో అర్హత సాధించగా, 10,705 మంది ఎంబైపీసీ విభాగంలో అర్హత సాధించారు. టాప్‌-10లో నగరానికి చెందిన నలుగురు విద్యార్థులున్నారు. ఇక బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఎంపీసీ విభాగంలో హైదరాబాద్‌ పరిధిలో 78.18శాతం మంది బాలురు అర్హత సాధించగా, 86.03 శాతం బాలికలు ర్యాంకులు సాధించారు. ఇక ఎంబైపీసీ విభాగంలో బాలురు 65.67 శాతం మంది పాసవ్వగా, 77.52శాతం మంది బాలికలు ర్యాంకులు సాధించారు. నగరానికి చెందిన సాయిఆశ్రిత్‌, సాయివిఘ్నేశ్‌, రోహన్‌కుమార్‌లు వరుసగా రాష్ట్రస్థాయిలో వరుసగా 2,3,4 ర్యాంకులు సాధించగా..బి. సంహిత్‌రెడ్డి 10వ ర్యాంకు సాధించారు. మేడ్చల్‌కు చెందిన ఇప్సిత 16వ ర్యాంకు సాధించింది.


కుటుంబసభ్యులతో..

కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుంది: పి.సాయిఆశ్రిత్‌, 2వ ర్యాంకు

రెండో ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మాసబ్‌ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కంప్యూటర్‌సైన్స్‌లో డిప్లొమా చేస్తా. తర్వాత బీటెక్‌లో చేరి కంప్యూటర్‌ సైన్స్‌ కొనసాగిస్తా. పదో తరగతి పుస్తకాలు క్షుణ్నంగా చదవడంతోపాటు రివిజన్‌ టెస్టులు రాశా.


నిత్యం సాధన చేశా: ఎల్‌.సాయివిఘ్నేశ్‌, 3వ ర్యాంకు

బోయిన్‌పల్లిలోని సెయింట్‌ పీటర్స్‌ గ్రామర్‌ స్కూల్‌లో పదో తరగతి చదివాను. పాఠ్య పుస్తకాలపై పట్టు సాధించాను. నిత్యం పాఠ్యాంశాలను రివిజన్‌ చేసుకుంటూ గత పరీక్షల ప్రశ్నపత్రాలపై సాధన చేశా. కంప్యూటర్‌సైన్స్‌ లేదా మెకానికల్‌లో డిప్లొమా చేసి.. బీటెక్‌ చేయాలనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని