అన్నారం పంప్‌హౌస్‌, పైపుల సామర్థ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రాజనర్సింహ
eenadu telugu news
Published : 29/07/2021 16:51 IST

అన్నారం పంప్‌హౌస్‌, పైపుల సామర్థ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రాజనర్సింహ

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం పంప్‌హౌస్‌ నిర్మాణం, నీటిని తరలించే పైపుల సామర్థ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దామోదర రాజనర్సింహ బహిరంగ లేఖ రాశారు. పంప్‌హౌస్‌ నిర్మాణంలో సరైన నిబంధనలు పాటించకుండా పనులు చేసిన ఏజెన్సీ, ఇంజినీర్లపై ఎలాంటి చర్యలు ఉంటాయో స్పష్టం చేయాలని దామోదర రాజనర్సింహ కోరారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీని నియమించే ఉద్దేశమేదైనా ఉందా? పైపుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని