నాసెన్స్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగి మృతి
eenadu telugu news
Published : 29/07/2021 18:59 IST

నాసెన్స్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగి మృతి

మేడ్చల్‌: జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్‌-2లోని నాసెన్స్‌ ల్యాబ్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో షిఫ్ట్‌ ఇంఛార్జ్‌ హరి ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరిప్రసాద్‌ ఇవాళ మృతి చెందారు.

బుధవారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్‌-2లోని నాసెన్స్‌ ల్యాబ్‌లో ఉదయం 7.45గంటలకు రియాక్టర్‌ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కమ్ముకొస్తున్న పొగల నుంచి మంటలతో పరుగులు పెడుతున్న కార్మికులతో ఆ ప్రాంతమంతా భీతావాహ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన షిఫ్ట్‌లో 54 మంది హాజరయ్యారు. సోడియం, మిథనాయిల్‌ను మిక్స్‌ చేస్తున్న క్రమంలో 7.45 గంటలకు ఒక్కసారిగా బయిలర్‌ నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించే లోపే భారీ శబ్దం వచ్చింది. విధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌ఛార్జ్‌ హరిప్రసాద్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. నందకిషోర్‌ కాలికి, అర్జున్‌ తలకు గాయాలయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని