తల్ల్లిపాల వారోత్సవాలకు ఏర్పాట్లు
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

తల్ల్లిపాల వారోత్సవాలకు ఏర్పాట్లు


అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నఅంగన్‌వాడీ ఉపాధ్యాయులు

బొంరాస్‌పేట, కొడంగల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తల్లిపాల ప్రాముఖ్యతను ప్రచారం చేయటానికి స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆగస్టు ఒకటి నుంచి ఏడు రోజులపాటు అంగన్‌వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు ‘తల్లిపాల వారోత్సవాలు’ నిర్వహిస్తారు. గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించటానికి స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో పాటుగా వైద్యసిబ్బంది, పొదుపు సంఘాల మహిళలతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తారు. జిల్లాలో కొడంగల్‌, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌లల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 969 అంగన్‌వాడీ, 138 మినీఅంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం వీటి ద్వారా 6,997 మంది గర్భిణులు, 8,065 మంది బాలింతలు వివిధ రకాల సేవలు పొందుతున్నారు. వీరికి పోషక విలువలున్న ఆహారం అందించటానికి ప్రభుత్వం పాలు, గుడ్లు అందిస్తున్నారు.

ప్రచారం చేస్తే ప్రయోజనం..

వారోత్సవాలు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారే తప్పా అందుకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలు, ప్రచారసామగ్రి సైతం అంగన్‌వాడీ కేంద్రాలకు అందటంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాలు కాబట్టి కేంద్రాల వారీగా నిర్వహిస్తూ చైతన్యం కలిగించాలి.

అవగాహన కల్పించాలి

- లలితకుమారి, మహిళా శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారి

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. పుట్టిన బిడ్డకు అరగంటలోపు ముర్రుపాలు తాగించాలి. ఆరు నెలలు తల్లిపాలనే అందించాలి. తద్వారా అందే పోషకాలు, కలిగే ప్రయోజనాలపై వివరిస్తాం. అంగన్‌వాడీల పరిధిలో కేంద్రం ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది ప్రచారం చేస్తుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని