జూనియర్‌ సివిల్‌ జడ్జ్జి పోస్టులకు ఎంపిక
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

జూనియర్‌ సివిల్‌ జడ్జ్జి పోస్టులకు ఎంపిక


తేజశ్రీరెడ్డి

పూడూరు, న్యూస్‌టుడే: పూడూరుకు చెందిన రైతు పట్లోళ్ల వెంకట్‌రెడ్డి, సునందల కుమార్తె తేజశ్రీరెడ్డి జూనియర్‌ సివిల్‌ జడ్జ్జి (జేసీజే) పోస్టుకు ఎంపికయ్యారు. 2020లో హైదరాబాద్‌లోని పడాల రాంరెడ్డి లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి ప్రస్తుతం ఆంధ్ర మహిళా సభలో ఎల్‌ఎల్‌ఎం కొనసాగిస్తూ లా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. శనివారం విడుదలైన ఫలితాల్లో తాను జేసీజేగా ఎంపికైనట్లు ఆమె తెలిపారు. రైతు కుటుంబం నుంచి జడ్జి స్థాయికి చేరుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


ఉమర్‌

దోమ: మండలకేంద్రానికి చెందిన ఉమర్‌ జూనియర్‌ సివిల్‌కోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి రుక్మొద్దీన్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇంటర్‌ (హెచ్‌ఈసీ) వరకు దోమ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. పరిగి సివిల్‌ కోర్టులో మూడేళ్లుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువు కృష్ణ ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని