శునకాన్ని తప్పించబోయి యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

శునకాన్ని తప్పించబోయి యువకుడి దుర్మరణం


లక్ష్మికాంత్‌రెడ్డి

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శునకాన్ని తప్పించబోయి రోడ్డు విభాగిణికి ఢీ కొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థులు, స్నేహితులు తెలిపిన వివరాలు.. ఎన్కతల గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మికాంత్‌రెడ్డి(27) సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట సమీపంలోని ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పని చేస్తున్నాడు. శనివారం పనుల నిమిత్తం ఎన్కతల నుంచి సదాశివపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ముర్షద్‌ దర్గా కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి విభాగిణికి ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపతిక్రి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నగరానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని