4.91 మీటర్లు పెరిగిన భూగర్భ జల మట్టం
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

4.91 మీటర్లు పెరిగిన భూగర్భ జల మట్టం

తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలోని బావిలో పైకి వచ్చిన నీరు

తాండూరు: జిల్లాలో జూన్‌, జులై నెలల్లో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి కళకళలాడుతున్నాయి. కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి జలాశయాలు మత్తడి దుంకాయి. కాగ్నా, కాకరవేణి నదులతో పాటుగా గ్రామాల సమీపంలోని ప్రధాన వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. మరో పక్క సాగులో ఉన్న పొలాల్లో కురిసిన వర్షం ఇంకిపోయింది. వాన నీటిని భూమిలోకి పంపేందుకు ఉపాధి హామీ పథకం కింద తవ్విన ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో వ్యవసాయ బావులు, పంపుసెట్లలో నీరు అమాంతం పైకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 4.91 మీటర్ల మేర భూగర్భజల మట్టం పెరిగిందని జిల్లా భూగర్భజల వనరుల అధికారి దీపారెడ్డి తెలిపారు. ప్రజలు గృహాలు, పొలాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని