నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్‌
eenadu telugu news
Published : 01/08/2021 05:26 IST

నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్‌

 330 కూర్మాలు స్వాధీనం.. ముఠా పట్టివేత


నక్షత్ర తాబేళ్లు, నిందితులతో అటవీ శాఖ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రామంతాపూర్‌: అంతరించిపోతున్న అరుదైన నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ నిఘా విభాగం పట్టుకుంది. 330 నక్షత్ర తాబేళ్లను అమ్మేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను విజిలెన్స్‌ అధికారి రాజారామణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రామంతాపూర్‌లో అదుపులోకి తీసుకొంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు చెందిన శివబాలక్‌, రాహుల్‌కశ్యప్‌ కొంతకాలంగా నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోమతి నదిలో పట్టుకుని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కోల్‌కతా నుంచి రైలులో శుక్రవారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌కు వచ్చి తరవాత రామంతాపూర్‌కు వచ్చిన స్మగ్లర్లను అధికారులు వల పన్ని పట్టుకున్నారు. జులైలోనూ వీరు మూడు సార్లు నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్‌ చేశారు.

కొనుగోలుదారులుగా వెళ్లి... రాజారామణారెడ్డి బృందం తాము కొనుగోలుదారులుగా పరిచయం చేసుకుని నక్షత్ర తాబేళ్ల స్మగ్లర్లను పట్టుకుంది. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్మర్లను మేడ్చల్‌ రేంజి అధికారికి అప్పగించినట్లు విజిలెన్స్‌ అధికారి రాజారమణారెడ్డి తెలిపారు. ఒక్కో నక్షత్ర తాబేలును రూ.400 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని