Ts News: ప్రధాని సహాయ నిధి పేరుతో లూటీ
eenadu telugu news
Updated : 01/08/2021 08:59 IST

Ts News: ప్రధాని సహాయ నిధి పేరుతో లూటీ

మూసాపేట, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలపై పోలీసులు ఓవైపు అవగాహన కలిగిస్తున్నా మోసపోవడం ఆగడం లేదు. మోసాలకూ అడ్డుకట్ట పడటం లేదు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల వెలుగు చూసిన ఆరోగ్యశ్రీ పేరుతో జరిగిన మోసం మరవక ముందే ప్రధాన మంత్రి సహాయ నిధి పేరుతో మరో మోసం బహిర్గతమైంది. బాధితుడు, సైబర్‌క్రైం కూకట్‌పల్లి ఇన్‌ఛార్జి గౌస్‌పాషా వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలోని హరిహర సదన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బి.వినీషా (23)కు ఈనెల 29న ఓ ఫోన్‌ వచ్చింది. తాను ప్రధానమంత్రి సహాయ నిధికి చెందిన అధికారినని ఆ వ్యక్తి చెప్పాడు. మీకు రుణం మంజూరైందని.. ఫోన్‌పే నంబరు చెబితే డబ్బులు పంపుతానని చెప్పాడు. దీంతో బాధితుడు నిజమేనని నమ్మి తన ఫోన్‌పే నంబరు చెప్పాడు. మొదట రూ.30 వేలు, ఆ తర్వాత రూ.5 వేలు తన ఫోన్‌కు రిక్వెస్ట్‌ రావడంతో దాన్ని బాధితుడు ఓకే చేశాడు. దీంతో రెండు దఫాలుగా రూ.35 వేలు అతని ఖాతా నుంచి బదిలీ అయినట్లుగా బాధితుడు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని