‘బీసీ బంధు పథఫఫకం ప్రవేశపెట్టాలి’
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

‘బీసీ బంధు పథఫఫకం ప్రవేశపెట్టాలి’


మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ చిత్రంలో నేతలు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని కోరారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేశ్‌, సుధాకర్‌, లాల్‌కృష్ణ, చంటి ముదిరాజ్‌ తదితరులతో కలిసి ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బంజారాహిల్స్‌లోని నివాసంలో వినతిపత్రం అందజేశారు. విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని, బీసీల సాధికారత సమావేశం ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని