రసాయనం పీల్ఛి. ఫార్మా ఉద్యోగి మృతి
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

రసాయనం పీల్ఛి. ఫార్మా ఉద్యోగి మృతి

అల్వాల్‌, న్యూస్‌టుడే: బైకుపై రసాయనాన్ని తరలిస్తుండగా లీకై.. ఓ ఫార్మా సంస్థకు చెందిన సహాయ మేనేజర్‌ మృతి చెందారు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన వేములపాటి ఆనంద్‌(36) శామీర్‌పేటలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం సంస్థకు చెందిన 2 లీటర్ల హెక్సా ఫ్లోర్‌ పాస్ఫరిక్‌ యాసిడ్‌ను సీసాలో బైకుపై తీసుకెళ్తున్నాడు. అల్వాల్‌లోని లైలా అకాడమీ వద్ద యాసిడ్‌ బయటకు రావడాన్ని గమనించాడు. వెంటనే హబ్సిగూడలో ఉండే తోటి ఉద్యోగి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌లో తెలిపాడు. అతను వచ్చే సరికే వాయువు ఆనంద్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో అపస్మారక స్థితికి చేరాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకర రసాయనాన్ని బయటకు ఎందుకు తెచ్చారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని