HYD: ప్రేమ జంట విషాదాంతం.. మూడో వ్యక్తి ప్రమేయం లేదు..
eenadu telugu news
Updated : 01/08/2021 10:58 IST

HYD: ప్రేమ జంట విషాదాంతం.. మూడో వ్యక్తి ప్రమేయం లేదు..

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మాదాపూర్‌లోని హోటల్‌లో జరిగిన ప్రేమజంట విషాదాంతం కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జులై 28న మధ్యాహ్నం 3.15కు హోటల్‌కు వచ్చినప్పటి నుంచి రాములు, సంతోషిల కదలికలపై ఆరాతీస్తున్నారు. సీసీ కెమెరాలతోపాటు యాక్సెస్‌కార్డు, ఇద్దరి ఫోన్ల కాల్‌డేటాను సేకరిస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారో వారిని విచారించనున్నారు. హోటల్‌లోని లగేజి సంతోషిదిగా గుర్తించారు. నగరంలో హాస్టల్‌లో ఉంటున్న ఆమెను ఖాళీ చేయించి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెవినొప్పి వల్ల సంతోషి ఇటీవల ఈఎన్‌టీ వైద్యుడి ద్వారా పరీక్షలు చేయించుకున్న పత్రాలు లభించాయి. పోలీసు పరీక్షకు సంతోషి జనవరిలో కరీంనగర్‌ వెళ్లి శిక్షణ తీసుకొని స్వగ్రామానికి వచ్చింది. మళ్లీ అక్కడికే వెళ్తున్నట్లు చెప్పి 15 రోజుల క్రితం నగరానికి వచ్చిన ఆమె 28న రాములును కలిసింది.

మూడో వ్యక్తి ప్రమేయం లేదు.. రాములు, సంతోషిల గదిలోకి మూడోవ్యక్తి వచ్చి ఉంటాడన్న వార్తల్లో నిజం లేదని మాదాపూర్‌ సీఐ రవీంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. బయటి వ్యక్తులకు యాక్సెస్‌ కార్డు ఉంటేనే గదిలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. సీసీ ఫుటేజీలను పూర్తిగా పరిశీలించాకే చెబుతున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని