Jeevandaan: అస్తమించి.. ముగ్గురి జీవితాలకు వెలుగునిచ్చి
eenadu telugu news
Updated : 01/08/2021 07:15 IST

Jeevandaan: అస్తమించి.. ముగ్గురి జీవితాలకు వెలుగునిచ్చి


శ్రీదేవి

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఇల్లాలిని కోల్పోయినా.. ఆ బాధను దిగమింగుకుని అవయవ దానానికి అంగీకరించి ముగ్గురి జీవితాల్లో వెలుగునింపాడో ఇంటిపెద్ధ నగరంలోని కొండాపూర్‌ ఇజ్జత్‌నగర్‌లో ఉంటున్న శ్రీదేవి(37) జూలై 27న ఉదయం ఇంటి నుంచి కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ఆమెకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ బృందం భర్త ప్రసాద్‌రావు, కుమార్తెలు రోహిణి, స్రవంతిలకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. శ్రీదేవి రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి.. శస్త్రచికిత్స ద్వారా ముగ్గురికి అమర్చినట్లు నిమ్స్‌ జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి వైద్యురాలు స్వర్ణలత తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని