ఉపాధి ఆధారిత కోర్సుల నిర్వహణకు విశ్వవిశ్వాని, మెడికవర్‌ ఒప్పందం
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

ఉపాధి ఆధారిత కోర్సుల నిర్వహణకు విశ్వవిశ్వాని, మెడికవర్‌ ఒప్పందం


కోర్సుల ప్రచారపత్రాలు విడుదల చేస్తున్న శ్రీనివాస్‌ఆచార్య, హరికృష్ణ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సరికొత్త కోర్సులు తీసుకువస్తున్నట్లు విశ్వవిశ్వాని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాస ఆచార్య తెలిపారు. బీబీఏ, పీజీడీఎం హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతి పొందినట్లు తెలిపారు. కోర్సుల నిర్వహణ, ఉపాధి కల్పనకు మెడికవర్‌ హాస్పిటల్స్‌, విశ్వవిశ్వాని ఇనిస్టిట్యూట్‌ శనివారం ఒప్పందం చేసుకున్నాయి. ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ ఆచార్య, ఆసుపత్రి కార్యనిర్వాహక సంచాలకుడు హరికృష్ణ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ.. మొదటి విడతగా 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మెడికవర్‌ ఆసుపత్రుల చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మహేశ్‌ దెగ్లూర్కర్‌, విశ్వవిశ్వాని ప్రవేశాల సంచాలకుడు రామకృష్ణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని